Header Banner

అరకులో భయంతో పరుగులు తీసిన పర్యాటకులు..! ఎందుకో తెలుసా..?

  Mon May 26, 2025 18:00        Others

ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయలో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది.. ఉదయం దట్టమైన పొగ మంచు.. ఆ తర్వాత కాస్త ఎండ.. ఆ తర్వాత దట్టంగా మబ్బులు కమ్ముకుని వర్షం..! గత కొంతకాలంగా ఇదే పరిస్థితి ఏజెన్సీలో చాలా చోట్ల ఉంది. దీంతో పర్యటకులు అరకులోయకి క్యూ కడుతున్నారు. దీంతో అరకు లోయలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. బొర్రా గుహలు, ట్రైబల్ మ్యూజియం, చాపరాయితోపాటు.. పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ కు సందర్శకులు భారీగా పెరిగారు. అందరూ ఎవరి ఎంజాయ్‌మెంట్లో వాళ్ళు ఉన్నారు. అయితే పద్మాపురం గార్డెన్స్‌లో.. ఒక్కసారిగా అలజడి రేగింది. భయంతో పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు.. అక్కడ ఓ భారీ నాగుపాము కనిపించినట్టు చెప్పారు కొంతమంది టూరిస్టులు. దీంతో వెళ్లి ఆ ప్రాంతం చూసేసరికి.. పెద్ద నాగు పాము పడగవిప్పి బుసలు కొడుతోంది. పర్యాటకుల అలికిడి పెరగడంతో.. మరింత కోపంతో మరింత పడగవిప్పి అటు ఇటు తిరుగుతుంది.
దీంతో తీవ్ర భయాందోళన గురైన స్థానికులు, పర్యాటకులు.. స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కృష్ణ.. బుసలు కొడుతున్న నాగుపామును అత్యంత చాకచక్యంగా బంధించాడు.

ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో రేషన్ కార్డు సేవలు..! ఈ నంబర్‌కు మెసేజ్ చేస్తే చాలు..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


కరోనా కొత్త వేరియంట్లు భారత్‌లోకి.. ! చిన్నారులు, వృద్ధులు రిస్క్‌లో..!


కేంద్రం వాహనదారులకు శుభవార్త! జాతీయ రహదారులపై టోల్ కొత్త పథకం!


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ArakuValley #TouristScare #ArakuNews #TravelAlert #TourismUpdate #AndhraTourism #NatureTrip #UnexpectedIncident